ప్రతి సినిమా పరీక్షే


Wed,December 6, 2017 11:37 PM

nagarjuna
అందమైన ప్రేమకథా చిత్రమిది. చిన్నవయసులోనే దూరమైన ప్రియురాలి కోసం ఓ ప్రేమికుడు సాగించే అన్వేషణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా చూడగానే యాదోం కీ భారత్ గుర్తుకొచ్చింది అని అన్నారు నాగార్జున. ఆయన నిర్మిస్తున్న చిత్రం హలో. అఖిల్, కళ్యాణి జంటగా నటిస్తున్నారు. విక్రమ్.కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. బుధవారం హైదరాబాద్‌లో నాగార్జున పాత్రికేయులతో ముచ్చటిస్తూ విక్రమ్ సినిమాల్లో ఉండే మ్యాజిక్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఆ మ్యాజిక్ మనుషుల్ని ఎలా విడదీస్తుంది, ఎలా కలుపుతుందన్నదే ఈ చిత్ర కథ. రొమాన్స్, యాక్షన్ అంశాల కలబోతగా ఉంటుంది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఈ నెల 10న వైజాగ్‌లో ఆడియో వేడుకను జరుపనున్నాం. ఈ సినిమాకు నేను వాయిస్‌ఓవర్‌ను మాత్రమే అందించాను. ఇందులో నటించలేదు. నేను నిర్మించిన లేదా నటించిన సినిమా విడుదలవుతుందంటే నాకు పరీక్షలాగే ఉంటుంది. రాత్రుళ్లు నిద్ర పట్టదు. భవిష్యత్తులో మంచి కథలు వస్తే నేను, చైతన్య, అఖిల్ కలిసి నటించడానికి సిద్ధమే. కొన్నాళ్లు నిర్మాణ బాధ్యతల్ని పక్కనపెట్టి నటనపై మాత్రమే దృష్టిసారించాలనుకుంటున్నాను అని చెప్పారు.

755

More News

VIRAL NEWS