అందరికోసం ఒక్కడు


Fri,January 4, 2019 12:29 AM

Akkadokaduntadu Title Song released by C Kalyan Siva Kantamaneni Ravi Babu

రామ్‌కార్తీక్, శివహరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అక్కడొకడుంటాడు. శ్రీపాద విశ్వక్ దర్శకుడు. కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాలోని అక్కడొకడుంటాడు..లెక్క గడుతుంటాడు అనే టైటిల్ గీతాన్ని నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్ విడుదల చేశారు. డ్రంకెన్ డ్రైవ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నేటి యువతరానికి మంచి సందేశం ఉంటుంది. యువతతో పాటు వారి తల్లిదండ్రులు కూడా చూడాల్సిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాలోని సందేశం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఫన్ భరత్, రాకెట్ రాఘవ, రాహుల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, రచన-దర్శకత్వం: శ్రీపాద విశ్వక్.

836

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles