ఎస్వీఆర్ స్ఫూర్తి

Fri,February 8, 2019 11:38 PM

అక్కడొకడుంటాడు చిత్రం నటుడిగా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అంధుడిగా ఛాలెంజింగ్ పాత్రలో చక్కటి నటనను కనబరిచానని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు అని అన్నారు శివ కంఠంనేని. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అక్కడొకడుంటాడు. శ్రీపాదవిశ్వక్ దర్శకుడు. కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో శివ కంఠంనేని పాత్రికేయులతో ముచ్చటిస్తూ కథను నమ్మి మేము చేసిన తొలి ప్రయత్నానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది. చిన్న సినిమాగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నది. నటుడిగా నాకు చక్కటి సంతృప్తి మిగిల్చింది. ఈ సినిమా అందించిన స్ఫూర్తితో భవిష్యత్తులో నా వయసుకు తగ్గ అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను. నటుడిగా ఎస్వీ రంగారావు నాకు స్ఫూర్తి. ఆయనలా విభిన్నమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకోవాలనుంది. ఇదే సంస్థలో నా తదుపరి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. త్వరలోనే కొత్త సినిమా విశేషాలు వెల్లడిస్తాను అని తెలిపారు.

1156

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles