మిస్టర్ మజ్ను ప్రేమకథ


Wed,December 12, 2018 11:47 PM

Akhils Mr Majnu Release Date Confirmed

అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరి 25న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. మిస్టర్ మజ్ను ఎవరు? అతడి ప్రేమకథకు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? ఈ అడ్డంకులను ఎలా అధిగమించాడన్నది ఆకట్టుకుంటుంది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. అఖిల్ పాత్ర ైస్టెలిష్‌గా నవ్యపంథాలో సాగుతుంది. వినూత్నమైన కథాంశంతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రేమ, వినోదం, యాక్షన్, సెంటిమెంట్ అంశాల సమాహారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈ సినిమాలోని గీతాలను ఒక్కొక్కటిగా త్వరలో విడుదల చేయనున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్.సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

3091

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles