భాస్కర్ దర్శకత్వంలో..

Mon,February 18, 2019 10:54 PM

ఇటీవల విడుదలైన మిస్టర్ మజ్ను అక్కినేని యువహీరో అఖిల్‌కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. అతని తదుపరి చిత్రంపై అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి. అఖిల్ తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ చిత్రానికి అంగీకరించాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్, బన్ని వాసు నిర్మాతలు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఒంగోలుగిత్త తర్వాత తెలుగులో మరే చిత్రాన్ని చేయలేదు బొమ్మరిల్లు భాస్కర్. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వబాధ్యతలు తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భాస్కర్ చెప్పిన కథలోని నవ్యమైన పాయింట్ నచ్చడంతో అఖిల్ ఈ సినిమాకు వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెకక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.

1707

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles