ప్రేమలోక విహారి

Mon,January 14, 2019 12:19 AM

అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా పాటలకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర గీతాల్ని నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయబోతున్నాం. ప్రేమలోక విహారి అందమైన కథ ఇది. నచ్చిన నెచ్చెలి కోసం అభినవ మజ్ను ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, సంగీతం: తమన్, ఎడిటింగ్: నవీన్ నూలి.

2892

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles