ఆకాశవాణి విశాఖ కేంద్రం


Thu,March 21, 2019 12:03 AM

Akashvani Visakhapatnam Kendram Title Poster Launch By Raj Kandukuri

శివ, ఉమయ జంటగా నటిస్తున్న చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. సైన్స్ స్టూడియోస్ పతాకంపై మర్రిమేకల మల్లిఖార్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ బత్తుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు సతీష్ ఈ కథను నాకు వినిపించాడు. నేటితరం ప్రేక్షకులు కోరుకునే హంగులన్నీ ఇందులో ఉన్నాయి అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. కథలోని మలుపులు థ్రిల్‌ను కలిగిస్తాయి. రేడియోస్టేషన్‌తో ఓ ప్రేమజంటకు ఉన్న సంబంధమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. అని తెలిపారు. మంచి సినిమాగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్, సినిమాటోగ్రఫీ:ఆరీఫ్.

1066

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles