రొమాంటిక్ కౌగిలిలో..

Tue,October 1, 2019 12:05 AM

ఆకాశ్‌పూరి, కేతికాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. నాయకానాయికలు కౌగిలిలో ఒదిగిపోయి తన్మయం చెందుతున్న ఈ ఫస్ట్‌లుక్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నది. ఇదివరకే హైదరాబాద్, గోవాలో షెడ్యూల్స్‌ను పూర్తిచేశాం. సోమవారం నుంచి హైదరాబాద్‌లో సరికొత్త షెడ్యూల్ మొదలుపెడతాం. ప్రేమికుల ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా సాగే కథాంశమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి అని చిత్రబృందం తెలిపింది. మందిరాబేడి, మకరంద్‌దేశ్ పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేశ్, సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాణ సంస్థ: పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరికనెక్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: పూరిజగన్నాథ్, దర్శకత్వం: అనిల్ పాదూరి.

552

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles