మైండ్ రీడర్ ప్రతీకారం


Wed,June 5, 2019 12:03 AM

ajay special movie is released on june 14th

అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం స్పెషల్. వాస్తవ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. రంగ, అక్షత జంటగా నటిస్తున్నారు. ఈ నెల 14న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకనిర్మాత వాస్తవ్ మాట్లాడుతూ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన యువతితో పాటు అందుకు కారణమైన వారిపై ఓ మైండ్ రీడర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఆసక్తిని కలిగిస్తుంది.క్రౌడ్ ఫండింగ్ విధానంలో స్నేహితులందరం కలిసి ఈ సినిమాను నిర్మించాం.

తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమా చేయోచ్చని నిరూపించిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పోలీస్ అధికారిగా అజయ్ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ సినిమాలో తాను సైకియాట్రిస్ట్ పాత్రలో నటించానని, సమాజాన్ని ప్రభావితం చేసే మంచి సినిమా ఇదని నటుడు అశోక్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జబర్దస్థ్ అప్పారావు, అమర్ తదితరులు పాల్గొన్నారు.

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles