స్త్రీ శక్తికి మించినది లేదు

Sun,March 10, 2019 11:47 PM

అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా తమ సంస్థలో మాస్టర్స్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అర్హురాలైన యువతికి లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రతిభావంతులైన యువతులు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో పురుషులతో సమానంగా ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు మహిళా దినోత్సవం రోజున ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొని విజేతలుగా నిలబడ్డ మహిళలను గౌరవించడానికి షీ ఇన్సైర్స్ కాంటెస్ట్‌ను రూపొందించాం. గత సంవత్సరం ప్రారంభించబడ్డ ఈ కాంటెస్ట్ రెండో సీజన్‌లో వచ్చిన 62 నామినేషన్లలో ఉత్తమంగా ఉన్న ఐదుగురిని ఎంపిక చేశాం. స్త్రీ శక్తికి మించిన శక్తి లేదు. తానే ఒక సూపర్‌పవర్. వినూత్న ఆలోచనలు కలిగిన యువతులను క్రియేటివిటీతో కూడుకున్న మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ఆహ్వానిస్తున్నా. తద్వారా ఈ రంగంలో తమదైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

987

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles