గుర్తుపట్టలేనంతగా..!

Sun,January 6, 2019 11:28 PM

ఈ ఫొటోలో నలుపు రంగులో కనిపిస్తున్న కథానాయికను గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు నయనతార. గ్లామర్ తళుకులతో సుదీర్ఘ కాలంగా దక్షిణాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆమె తాజా తమిళ చిత్రం ఐరాలో నల్లటి శరీర వర్ణ ఛాయతో కనిపిస్తున్నది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ హంగుల మిళితంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభియనం చేస్తున్నది. పల్లెటూరి యువతి భవానీగా, ఆధునిక భావాలు కలిగిన పట్టణ అమ్మాయి యమునగా భిన్న పార్శాల్లో రెండు పాత్రలు వినూత్నంగా సాగుతాయని చిత్రబృందం తెలిపింది. పల్లెటూరి యువతి పాత్రలో నలుపు శరీరవర్ణఛాయతో పూర్తిగా ఢీ గ్లామర్ లుక్‌లో నయనతార కనిపిస్తున్నది. ప్రత్యేకమైన మేకప్‌తో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు దర్శకుడు సృజన్ పేర్కొన్నారు. నయనతార నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రయోగాత్మకంగా ఈ పాత్ర ఉంటుందని తెలిపారు. ఆడపిల్లలపై సమాజంలో కొనసాగుతున్న వివక్ష, లైంగికదాడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా విడుదలకానుంది. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది.

4623
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles