ఏజెంట్ ఆత్రేయ పరిశోధన

Thu,February 7, 2019 11:38 PM

నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ నాయికా నాయికలుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న తాజా చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకుడు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ మళ్లీ రావా చిత్రం తరువాత విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించింది. ఓ డిటెక్టివ్ ఏజెంట్ చేసిన నేర పరిశోధన నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. షూటింగ్ పూర్తయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీంతం: మార్క్ కె. రాబిన్, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, సౌండ్ ఇంజినీర్: నాగార్జున తాళ్లపల్లి, ఆర్ట్: క్రాంతి ప్రియం.

1073

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles