లండన్‌లో ఉద్యోగం వదిలేశా!


Sat,June 8, 2019 11:56 PM

agent sai srinivas athreya theatrical trailer psrd

నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. స్వరూప్ రాజ్ దర్శకుడు. శృతిశర్మ కథానాయిక. రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం రాత్రి యువ దర్శకుడు నాగ్ అశ్విన్, మధుర శ్రీధర్‌రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ నవీన్ నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి తెలుసు. తనలో మంచి నటుడున్నాడు. కొత్త పంథాలో ప్రచారం చేస్తే సినిమాపై ఆసక్తిని రేకెత్తించవచ్చు. అలాంటి ప్రచారంతోనే ఈ చిత్ర టీమ్ వస్తోంది. ట్రైలర్‌లో కామెడీ, థ్రిల్లర్ అంశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మంచి కథతో వస్తున్నారని అర్థమవుతోంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఏజెంట్ అనే పదం పక్కన ఇంగ్లీష్ పేర్లతో వున్న టైటిల్స్ చాలా కనిపిస్తాయి.

అందుకు భిన్నంగా ఏజెంట్ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు వుంటే ఎలా వుంటుంది అనే ఆలోచనతో ఈ చిత్రానికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని పెట్టాం. ఆత్రేయ ప్రేక్షకుల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్‌కు గురిచేస్తాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి ఫీల్‌తో బయటికి వస్తారు అని తెలిపారు. యూట్యూబ్‌లో కొన్ని లఘు చిత్రాలు చేశాను. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను. లండన్‌లో ఉద్యోగం మానేసి ఇక్కడి వచ్చి స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్ ప్రారంభించాను. బాలీవుడ్‌లో కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేశాను. ఏడాది పాటు శ్రమించి ఈ చిత్ర కథని సిద్ధం చేశాం. ఈ నెల 21న మీ ముందుకు రాబోతున్నాం. తప్పకుండా ఆకట్టుకుందనే నమ్మకంతో వున్నాం అన్నారు.

2401

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles