మురుగదాస్ దర్శకత్వంలో..?


Mon,September 24, 2018 12:05 AM

After Vijay Sarkar AR Murugadoss to make a film with Rajinikanth

సరికొత్త కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఏ.ఆర్.మురుగదాస్. ప్రస్తుతం ఆయన విజయ్ కథానాయకుడిగా తమిళంలో సర్కార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 6న విడుదల సిద్ధమవుతున్నది. ఇదిలా వుండగా మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని రజనీకాంత్‌తో చేయబోతున్నట్లు తెలిసింది. మురుగదాస్ మార్కు అంశాలతో రూపొందనున్న ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాల సమచారం. రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న 2.ఓ చిత్రంతో పాటు కార్తీక్ సుబ్బరాజు రూపొందిస్తున్న యాక్షన్‌థ్రిల్లర్ పేట్టలో నటిస్తున్నారు.

3604

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles