రొమాంటిక్ మొదలైంది


Mon,February 11, 2019 11:47 PM

After Mehbooba, now Akash Puri next Romantic

దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్ పేరుతో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కల్యాణ్‌రామ్ క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని, ఆకాష్ పూరి పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలావుండగా రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.

932

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles