పొల్లాచ్చిలో షురూ


Thu,January 3, 2019 01:44 AM

After Kamal Haasans Indian 2 Shankar to direct Hrithik Roshan in superhero film

2.ఓ చిత్రంతో పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు శంకర్. సైంటిఫిక్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విజయోత్సహంతో తన తదుపరి చిత్రం ఇండియన్-2ను మొదలుపెట్టబోతున్నారు శంకర్. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18న పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. పొల్లాచ్చి అనంతరం ఉక్రెయిన్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రాచీన యుద్దవిద్యల్లో ఆమె శిక్షణ తీసుకుంటున్నది. కమల్‌హాసన్, శంకర్ కలయికలో 1996లో విడుదలైన ఇండియన్ సినిమాకు సీక్వెల్ ఇది. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ పాత్ర ప్రయోగాత్మకంగా ఉండనున్నట్లు తెలిసింది. తన కెరీర్‌లో ఇండియన్-2 చివరి సినిమా కావచ్చునని కమల్‌హాసన్ ఇటీవలే ప్రకటించారు.

879

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles