అడివి శేష్ ఎవరు


Tue,June 4, 2019 12:11 AM

adivi sesh movie titled as evaru

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ఎవరు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అడివిశేష్, పీవీపీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్ట్ 23న విడుదలకానుంది. ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. థ్రిల్లర్ అంశాలు మేళవించిన చిత్రమిది. అనుక్షణం ఉత్కంఠను పంచుతుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అని చిత్రబృందం తెలిపింది. రెజీనా, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వంశీ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె.

1475

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles