పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సివచ్చింది!


Sat,August 24, 2019 12:19 AM

adivi sesh heart touching emotional speech at evaru thanks meet

‘నేను అమెరికాలో ఉన్నప్పుడు బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడిన రోజులున్నాయి. కెరీర్‌ తొలినాళ్లలో ‘కిస్‌' సినిమా తీసి చాలా నష్టపోయాను. ఎంతలా అంటే సినిమా పోస్టర్లకు అంటించిన మైదాపిండి ఖర్చుకూడా రాలేదు. అప్పులు ఇచ్చిన వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు’ అన్నారు అడివి శేష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఎవరు’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. పీవీపీ నిర్మాత. శుక్రవారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. అడివి శేష్‌ మాట్లాడుతూ ‘కాలిఫోర్నియా నుంచి వచ్చినా కృష్ణానగర్‌ కష్టాలు నాకు తెలుసు. ‘కిస్‌' సినిమాకు మూడుకోట్లు నష్టపోయాను. అప్పుల వాళ్ల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సివచ్చింది. ఆ తర్వాత ‘మనసుకు నచ్చిందే చేస్తాను.

మనస్ఫూర్తిగా చేస్తాను’ అని నిర్ణయించుకున్నాను. ‘క్షణం’ తర్వాత అడివి శేష్‌ 2.ఓ ప్రయాణం మొదలైంది. వరుసగా నాలుగు విజయాలొచ్చాయి. గత రెండురోజుల్లో నలుగురు నిర్మాతలు ఫోన్లు చేసి కథ ఏదైనా సరే నాతో సినిమా చేస్తామని అడుగుతున్నారు. అలాంటి నమ్మకం కోసమే ఇన్ని రోజులు పనిచేశాను. కెరీర్‌ ముగిసిన తర్వాత ‘అడివి శేష్‌ మంచి సినిమాలు చేశాడు’ అని అందరూ అనుకుంటే అదే చాలు. అంతేకాని నాకు కటౌట్లు కట్టాలని, పాలాభిషేకాలు చేయాలని కోరుకోను’ అన్నారు. అందరూ సినిమాను ప్రేమించి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, దర్శకుడిగా తన ప్రయాణంలో మిత్రులు, శ్రేయోభిలాషులు ఎంతగానో సహకరించారని దర్శకుడు వెంకట్‌ రామ్‌జీ తెలిపారు.
rejina
రెజీనా మాట్లాడుతూ ‘మేము ఊహించిన దానికంటే సినిమా పెద్ద విజయం సాధించింది. విడుదలకు ముందే సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందనిపించింది. ప్రేక్షకాదరణ దానిని రుజువు చేసింది’ అని చెప్పింది. ఛాయాగ్రాహకుడిగా అరంగేట్ర చిత్రానికే ఈ స్థాయిలో పేరురావడం ఆనందంగా ఉందని వంశీ పచ్చిపులుసు పేర్కొన్నారు. తన ప్రయాణంలో అడివి శేష్‌ ఇంకా ఎదగాలని మాటల రచయిత అబ్బూరి రవి ఆకాంక్షించారు.

473
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles