ముద్దుల ముచ్చట్లు


Tue,October 9, 2018 11:52 PM

Adith Arun and Hebah Patel 24 Kisses Movie October 26th Relese

అదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం 24కిస్సెస్. అయోధ్య కుమార్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. బోల్డ్ కంటెంట్‌తో పాటు అందమైన ప్రేమకథా చిత్రమిది. కథానుగుణంగా టైటిల్ పెట్టాం. ప్రేమలోని లోతైన భావనలకు అద్దం పడుతుంది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వినూత్న కథాంశంతో రూపొందిన ఈ చిత్ర అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉంది అని చిత్రబృందం వెల్లడించింది. నరేష్, రావు రమేష్, అదితిమైఖేల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాల, సంగీతం: జోయ్ బరువా, ఆర్ట్: హరివర్మ, నిర్మాతలు: సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి.

5418

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles