Telangana Intermediate 1st & 2nd Year Results 2019

తెలుగులో అతిరన్


Sat,March 23, 2019 11:28 PM

Actress Sai Pallavi Athiran in Telugu

గత ఏడాది సాయిపల్లవి కథానాయికగా నటించిన పడి పడి లేచె మనసు చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలపై దృష్టిపెట్టింది సాయిపల్లవి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా మలయాళ చిత్రం అతిరన్ తెలుగులో అనువాదరూపంలో విడుదలకాబోతున్నది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ దర్శకుడు. ఫహద్‌ఫాజిల్ కథానాయకుడిగా నటించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ, తమిళ వెర్షన్స్ ఒకే తేదిన విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయిపల్లవి ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. రానా కథానాయకుడు. సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. రాజకీయ, సామాజికాంశాల నేపథ్యంలో రూపొందించనున్న ఈ చిత్రానికి విరాటపర్వం అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

1511

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles