నల్లని నయన

Sun,February 10, 2019 12:21 AM

పాత్రల పరంగా ప్రయోగాలు చేయడం నయనతారకు కొత్తేమీ కాదు. పలు సినిమాల్లో సవాళ్లతో కూడిన విభిన్నమైన పాత్రలతో నటిగా ప్రతిభను చాటుకున్న ఆమె తమిళ చిత్రం ఐరా కోసం తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నది. మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్ష నేపథ్యంలో సందేశాత్మక కథాంశంతో దర్శకుడు సర్జున్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భవానీ అనే పాత్రలో నలుపు వర్ణశరీర ఛాయ కలిగిన పల్లెటూరి అమ్మాయిగా నయనతార ఢీ గ్లామర్ పాత్రలో కనిపిస్తున్నది. ద్విపాత్రాభినయం కావడంతో రెండు పాత్రల మధ్య వైవిధ్యత ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నలుపు రంగులో కనిపించాలని నయనతార నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా బ్లాక్ కలర్ మేకప్‌తో పాత్ర కోసం సన్నద్ధమవడానికి ప్రతిరోజు రెండు, మూడు గంటల సమయం పట్టేదని, అలంకరణలేవి లేకుండా సాధారణంగా ఈ పాత్రను తెరపై ఆవిష్కరించాలనే ఆలోచన మొత్తం ఆమెదేనని తెలిసింది.

1811

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles