ఫోర్బ్స్ జాబితాలో..


Thu,December 6, 2018 12:15 AM

actor vijay devarakonda gets place in forbes india celebrity list 2018

అర్జున్‌రెడ్డి గీత గోవిందం చిత్రాలతో తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించారు యువహీరో విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్‌దేవరకొండ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2018 సంవత్సరానికిగాను అత్యధికంగా ఆర్జించిన టాప్ 100 మంది జాబితాలో విజయ్‌దేవరకొండ 14కోట్లతో 72వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ 253.35కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ వందమంది జాబితాలో టాలీవుడ్ నుంచి పవన్‌కల్యాణ్ (31.33కోట్లు 24వ స్థానం), ఎన్టీఆర్ (28కోట్లు 28వ స్థానం), మహేష్‌బాబు (24.33 కోట్లు 33వ స్థానం) ఉన్నారు. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని విజయ్‌దేవరకొండ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

1543

More News

VIRAL NEWS