ఇంతగా దిగజారుతావని అనుకోలేదు!


Fri,June 14, 2019 11:30 PM

Actor Varalaxmi slams Vishal for Nadigar Sangam polls video defaming her dad

హీరో విశాల్‌తో గత కొంత కాలంగా స్నేహంగా వున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా అయనపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో హీరో విశాల్‌ పాండవార్‌ ప్యానెల్‌ తరుపున పోటీ చేస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవార్‌తో పాటు కే భాగ్యరాజ స్వామి, శంకర్‌ దాస్‌ ప్యానెల్‌లు కూడా పోటీకి దిగుతున్నాయి. ఇప్పటికే అంతా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా నటుడు శరత్‌కుమార్‌పై విశాల్‌ చేసిన వ్యాఖ్యలు వరలక్ష్మికి ఆగ్రహాన్ని తెప్పించాయి. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలకుగాను వరలక్ష్మి శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా విశాల్‌పై నిప్పులు చెరిగింది. ఓ లెటర్‌ను పోస్ట్‌ చేసిన ఆమె అందులో విశాల్‌ని ఘాటుగా విమర్శించడం తమిళ చిత్ర వర్గాల్లో సంచలనంగా మారింది. ‘నీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో చూశా. ఇంతగా దిగజారుతావని అనుకోలేదు. నీ వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యా.
Varalaxmi-Sarathkumar
ఎంతో బాధపడ్డా. నీపై నాకున్న కాస్త గౌరవం కూడా పోయింది. నా తండ్రి (శరత్‌కుమార్‌) గతం గురించి, ఆయనపై వున్న భూ వివాదం గురించి ఆరోపణలు చేయడం విచారకరం. అది కోర్టు పరిధిలో వుంది. తుది తీర్పు ఇచ్చే వరకు ఎవరూ దోషులు కారు. దోషి అని తేలిన తరువాతే శిక్షపడుతుంది. నువ్వు కాస్త హుందాగా ప్రవర్తించు. ఇలాంటి నీచమైన వీడియోలు నీ దిగజారుడు స్వభావాన్ని తెలుపుతున్నాయి. ఇకనైనా రుషిలా నటించొద్దు. మాకు నీ రెండు నాల్కల ధోరణి, నువ్వు చెప్పే అబద్ధాల తీరు బాగా తెలుసు. నువ్వు నిజంగా రుషిలాంటి వాడివే అయితే నీ సొంత జట్టు పాండవార్‌ నిన్ను తప్పుపట్టేది కాదు. నువ్వు ఇప్పటి వరకు గొప్ప పనులు, గర్వంగా చెప్పుకునే పనులు చేసుంటే వాటిని ప్రజలకు వివరించు. ప్రచారంలో వాటి గురించి ప్రధానంగా మాట్లాడు. అంతే కానీ మా నాన్నని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయకు. ఇన్నాళ్లు నేను నిన్ను గౌరవించాను. ఓ స్నేహితుడిలా భావించాను. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నాను. కానీ ఇప్పుడు నువ్వు హద్దులు దాటి ప్రవర్తించావు. పోనీలే కనీసం తెర వెనుకైనా నువ్వు మంచి నటుడివి అనిపించుకున్నావు. ఎప్పుడూ చెబుతుంటావు కదా సత్యం గెలుస్తుందని అదే జరుగుతుందని కోరుకుంటున్నా’ అని విశాల్‌కు ఓపెన్‌ సవాల్‌ విసిరింది వరలక్ష్మి.

3753

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles