కథే సూపర్‌స్టార్


Thu,June 6, 2019 11:09 PM

Actor Sunil Speech At Jai Sena Movie Press Meet

శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జై సేన. వి. సముద్ర దర్శకుడు. శివ మహాతేజ ఫిల్మ్స్ పతాకంపై వి.సాయి అరుణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను సునీల్ గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి కథే సూపర్‌స్టార్. ఇప్పటి వరకు వినోదభరిత పాత్రల్లో కనిపించా కానీ తొలిసారి ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు భిన్నంగా వుండబోతుంది అన్నారు. సముద్ర మాట్లాడుతూ ఈ చిత్రంలో శ్రీకాంత్, సునీల్‌తో పాటు నలుగురు కొత్త హీరోలు నటిస్తున్నారు. కొంత ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. నా ప్రతి చిత్రంలో ఓ సామాజిక సందేశం ఉన్నట్లే ఈ చిత్రంలోనూ మంచి సందేశం ఉంటుంది. మా టీమ్‌కి మంచి పేరు తెచ్చిపెడుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కార్తికేయ, అభిరామ్, హరీష్ గౌతమ్, అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధన్‌రాజ్, వేణు, చమ్మక్‌చంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమలశెట్టి సుమన్, పార్వతీ చందు, పాటలు: అభినయ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్, సహనిర్మాతలు: పి.శిరీష్‌రెడ్డి, దేవినేని శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి. సముద్ర.

1142

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles