దర్శకుడిగా అరంగేట్రం


Sat,September 14, 2019 12:30 AM

Actor Satya Prakash Turns Director With Ullaala Ullaala Movie

ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా విలక్షణ అభినయంతో దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు సత్యప్రకాష్‌ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ‘ఉల్లాల ఉల్లాలా’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. నటరాజ్‌, అంకిత, నూరిన్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఎ.గురురాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ‘భిన్న భాషల్లో ఐదు వందలకుపైగా సినిమాలు చేశాను. పోలీస్‌స్టోరీ, సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాలు నటుడిగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దర్శకత్వం చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం థ్రిల్‌ను పంచుతుంది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా కథాగమనం సాగుతుంది’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘సత్యప్రకాష్‌ నాకు మంచి మిత్రడు. నటుడితో పాటు అతడిలో మంచి దర్శకుడు ఉన్నాడు. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని అన్నారు. గురురాజ్‌, సత్యప్రకాష్‌, కాళకేయ ప్రభాకర్‌, పృథ్వీరాజ్‌, రఘు, నవీన్‌, లోబో ప్రధాన పాత్రల్లో ఈ చిత్రానికి సంగీతం: జాయ్‌, ఛాయాగ్రహణం: జె.జి. కృష్ణ, దీపక్‌, ఆర్ట్‌:.కె.మురళీధర్‌.

285

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles