విజయేంద్రప్రసాద్‌ కథతో..


Wed,September 11, 2019 12:36 AM

actor sapthagiri new movie starts in hyderabad

సప్తగిరి హీరోగా రెయిన్‌బో మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది హర్షవర్ధన్‌ దర్శకుడు. శైలేష్‌ వసందాని నిర్మాత. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. కంచి కామాక్షి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో మంగళవారం ఈ చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదభరిత కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పక్కా ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాం. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, డైలాగ్స్‌: అజయ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ సర్వమణి.

517

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles