మంచితనం ఉంటే చాలు!

Tue,November 5, 2019 12:10 AM

సాయిపల్లవిని చూస్తే మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. కథానాయిక తాలూకు కృత్రిమ హంగులకు అతీతంగా సహజసౌందర్యంతో దర్శనమిస్తుంది. జీవితం తాలూకు వివిధ దృక్కోణాలపై ఆమెకున్న జ్ఞానం అబ్బురపరుస్తుంది. తాజాగా వి ది ఉమన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి అందం, శారీరక ఆకృతి గురించి సమాజంలో ఉన్న ఆపోహలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినీరంగంలోకి వచ్చే ముందు అభద్రతాభావంతో సతమతమయ్యాను. నాయికగా నన్ను స్వీకరిస్తారో లేదో అనే సంశయం ఉండేది. ఎందుకంటే చిన్నతనం నుంచి వెండితెర కథానాయికలంటే తీరైన శరీరాకృతి, ఇట్టే ఆకర్షించే అందచందాలు అనే భావనలో పెరిగాం. అందుకే నాయికగా ప్రేమమ్‌లో తొలి అవకాశం వచ్చినప్పుడు ఒత్తిడికి గురయ్యాను. సినిమా విడుదలయ్యాక నా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సోషల్‌మీడియాలో స్పందన చూశాను. ఎలాంటి విమర్శలు లేకుండా నన్ను నన్నుగా స్వీకరించడం ఆనందంగా అనిపించింది. మనం మనలాగే ఉండాలి. ఎవరికోసమో కొత్త హంగుల కోసం తాపత్రయ పడటం వృథా. మంచితనంతో ఉంటూ ఇతరుల్లో మంచిని గ్రహిస్తే చాలు. అన్నింటికంటే మహిళలకు ఆత్మాభిమానం ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పింది.

575

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles