ప్రతి సినిమాకు ఎదుగుతున్నాడు!


Fri,January 4, 2019 12:33 AM

actor bellamkonda srinivas birthday celebrations

సాయి శ్రీనివాస్‌తో అల్లుడు శీను చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో కొత్త హీరోతో చేస్తున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అనుభవమున్న హీరోగా నటించాడు. బోయపాటి శ్రీను రూపొందించిన జయ జానకి నాయకతో స్టార్ హీరో అయ్యాడు. నటుడిగా ప్రతి సినిమాకు శ్రీనివాస్ ఎదుగుతున్నాడు. అల్లుడు శీను పాటల్ని ఇప్పటికీ మర్చిపోలేను. అంత భారీగా ఆ చిత్రాన్ని రూపొందించాం. శ్రీనివాస్ పెద్ద స్టార్ కావాలి అన్నారు వి.వి.వినాయక్. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ మా కుటుంబ సభ్యుడు. ప్రతి సినిమాకు డ్యాన్స్, ఫైట్స్ పరంగానే కాకుండా నటుడిగానూ తను ఎదుగుతున్నాడు. మంచి కథలని ఎంచుకుంటూ మునుముందు తను మరింత ఎదగాలి అన్నారు. డ్యాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ మెప్పించిన సాయి శ్రీనివాస్ తాజాగా మేము నిర్మిస్తున్న చిత్రంలో మాత్రం నటనకు ఆవకాశమున్న రాముడి లాంటి పాత్రలో కనిపించనున్నాడు. అతనికి అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుంది అని అనిల్ సుంకర తెలిపారు. హీరోగా నన్ను పరిచయం చేసిన వి.వి.వినాయక్ గారికి కృతజ్ఞతలు. నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతల్ని నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, అభిషేక్ అగర్వాల్, బెక్కెం వేణుగోపాల్, అభిషేక్ నామా, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.

2014

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles