యాక్షన్ మైలురాయిలా నిలుస్తుంది!

Mon,November 11, 2019 12:22 AM

యాక్షన్ చిత్రం అభిమానులకు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. నా కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు విశాల్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం యాక్షన్. సుందర్.సి దర్శకత్వం వహించారు. శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ ఆడెపు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రమిది. 27 సినిమాల ప్రయాణంలో నేను ఎక్కువ గాయాలపాలైన సినిమా. ట్రైలర్‌లో చూపించిన బైక్‌ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలాయి. కానీ దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. 60 కోట్ల బడ్జెట్‌లో 88 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. తమన్నాతో నా కాంబినేషన్‌లో రెండో సినిమా ఇది. ఈ సినిమాలో హీరో రానా ఒక పాట పాడారు. తెలుగులో అభిమన్యుడుకు మించి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే హంగులు ఎక్కువగా ఉంటాయని తమన్నా చెప్పింది. నిర్మాత మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, పంపిణీదారుడిగా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది అని చెప్పారు.
Tamannaah

496

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles