ఒకటి కాదు రెండు దయ్యాలు


Wed,April 17, 2019 12:25 AM

Abhinetri 2 movie released on may 1st

ప్రభుదేవా, తమన్నా, నందితాశ్వేత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అభినేత్రి-2. ఏ.ఎల్ విజయ్ దర్శకుడు. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నారు. అభినేత్రికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మే 1న విడుదలకానుంది. మంగళవారం ఫస్ట్‌లుక్ టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. తొలిభాగంలో భార్యాభర్తలుగా కనిపించిన తమన్నా, ప్రభుదేవా ఈ సీక్వెల్‌లో అదే పాత్రల్లో కనిపిస్తున్నారు. రూబీ, అలెక్స్‌గా వారి పాత్రలు టీజర్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీజర్‌లో చివరలో ఒకటి కాదు రెండు దయ్యాలు అంటూ కోవై సరళ చెప్పే డైలాగ్ వినోదాన్ని పంచుతున్నది. తొలి భాగానికి భిన్నంగా పూర్తి విదేశీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తున్నది. నిర్మాతలు మాట్లాడుతూ హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. గృహిణి పాత్రలో తమన్నా లుక్, నటన హైలైట్‌గా నిలుస్తాయి. భిన్న పార్శాలతో ప్రభుదేవా పాత్ర సాగుతుంది. అలెక్స్, రూబీ ఎవరు? వారు ఎందుకు ఆత్మలుగా మారారు? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తూనే ఆహ్లాదాన్ని పంచే చిత్రమిది. టీజర్‌కు సామాజిక మాధ్యమాల్లో చక్కటి స్పందన లభిస్తున్నది. వినూత్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అయాంకాబోస్, సంభాషణలు: సత్య.

2580

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles