భయపెట్టే అభినేత్రి-2


Fri,April 12, 2019 12:29 AM

Abhinetri 2 Gets A Release Date confirmed releasing on may 1

2016లో విడుదలైన అభినేత్రి చిత్రం ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అభినేత్రి-2 రూపొందుతున్నది. ప్రభుదేవా, తమన్నా, నందితాశ్వేత, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ దర్శకుడు. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నారు. చిత్రీకణ పూర్తయింది. మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హారర్ కామెడీ చిత్రమిది. వినోదంతో పాటు ఆద్యంతం భయపెడుతూ కథ సాగుతుంది. తమన్నా పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అయాంకాబోస్, సంభాషణలు: సత్య, దర్శకత్వం: విజయ్.

1723

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles