భయపెట్టే అభినేత్రి-2


Mon,May 20, 2019 11:34 PM

Abhinayatri 2 which is a sequel to the film will be released on May 31st.

ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం అభినేత్రి-2 ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది. విజయ్ దర్శకుడు. అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ అభినేత్రి చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది. వినోదం మేళవించిన హారర్ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. నాయకానాయికలు ఎందుకు దయ్యాలుగా మారారనే అంశం ఆసక్తికరంగా ఉంటుంది. టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. నందితాశ్వేత, సప్తగిరి, సోనూసూద్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయంక బోస్, సంగీతం: శామ్ సి.ఎస్.

1396

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles