మా కల నెరవేరింది


Sat,May 18, 2019 11:49 PM

ABCD success meet

ఏబీసీడీ చిత్రం నా కెరీర్‌లోనే ఉత్తమ ప్రారంభ వసూళ్లను సాధించింది. నటుడిగా నేను పరిణితి చెందిన భావన కలుగుతున్నది అన్నారు అల్లు శిరీష్. ఆయన కథానాయకుడిగా సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏబీసీడీ చిత్రం శుక్రవారం ప్రేక్షకులముందుకొచ్చింది. సురేష్‌బాబు సమర్పణలో మధురశ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. రుక్సార్ థిల్లాన్ కథానాయిక. శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ సినిమాలో నేను పోషించిన పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. దర్శకుడు నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాడు. ఈ వేసవిలో కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే చిత్రాన్ని అందివ్వడం ఆనందంగా ఉంది అన్నారు. సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. తండ్రీకొడుకుల భావోద్వేగాల్ని చక్కగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలనుకున్న మా ఆశయం నెరవేరింది.

శిరీష్ తన పాత్రలో జీవించాడు. అతనిలో సంతోషాన్ని చూడాలనుకున్నాం. మా కల ఈరోజు నెరవేరింది. భరత్, వెన్నెల కిషోర్ మంచి హాస్యాన్ని పండించారు. త్వరలోనే మరో సక్సెస్‌మీట్‌ను నిర్వహించబోతున్నాం అని మధురశ్రీధర్‌రెడ్డి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ మేం ఆశించిన విధంగానే సినిమాకు భారీ ఓపెనింగ్ వచ్చాయి. శిరీష్ నటన బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

1155

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles