డబ్బున్న వారి కష్టాలు!


Tue,April 16, 2019 12:12 AM

abcd movie trailer launch

సినిమాల పట్ల ఎక్కువ పరిజ్ఞానం ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో శిరీష్ ఒకడు. సినిమాను అర్థం చేసుకొని నటిస్తుంటాడు. సినిమాల్ని ప్రేమించే శిరీష్ లాంటి నటుల వల్ల మంచి చిత్రాలు వస్తాయి అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఏబీసీడీ. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. సురేష్‌బాబు సమర్పణలో మధురశ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు త్రివిక్రమ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బున్న ఇద్దరి యువకుల కష్టాల్ని ఇష్టంగా సినిమాలో చూపించారు. జల్సా సమయంలో శిరీష్ పరిచయమయ్యాడు. అతడు మరిన్ని మంచి సినిమాలు చేయాలి. వెంకీ, రెడీ చిత్రాల్లో భరత్ నటన నాకు నచ్చింది. ట్రైలర్ చూస్తే సినిమా హిట్ అవుతుందనిపిస్తుంది. మధుర శ్రీధర్ లాంటి సినిమాల్ని ప్రేమించే నిర్మాతల చిత్రాలు ఆడాలి. ఆయనకు ఈ సినిమా బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి.

దర్శకుడికి మంచి జ్ఞాపకాల్ని మిగల్చాలి అని తెలిపారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ దర్శకుడు సంజీవ్ తన నుంచి చక్కటి నటనను రాబట్టుకున్నారు. తెలుగు శ్రోతలకు కొత్తరకం పాటల్ని సంగీత దర్శకుడు జుధాసాంధీ ఇచ్చాడు అని తెలిపారు. పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో సినిమా చేయాలనే కోరిక ఏబీసీడీతో తీరింది. వేసవిలో అందరికి చక్కటి నవ్వులను పంచే సినిమా ఇది. కథను నమ్మి యష్ రంగినేని, సురేష్‌బాబు ఈ సినిమా నిర్మాణంలో చక్కటి సహకారాన్ని అందించారు. మే 17న ఈ సినిమాను విడుదలచేస్తున్నాం అని నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. కోట్ల రూపాయలకు అధిపతులైన ఇద్దరు డబ్బున్న ఎన్‌ఆర్‌ఐ యువకులు అనివార్య కారణాల వల్ల పరిమితమైన డబ్బుతో ఇండియాలోని మురికివాడలో ఎందుకు గడిపారు? ఈ ప్రయాణంలో వారికి ఎలా కష్టాలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రుక్సార్ థిల్లన్, సంజీవ్‌రెడ్డి, ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు.

1241

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles