ఎన్నారై సరదాలు


Sat,May 11, 2019 12:02 AM

abcd clears censor clean u certificate

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఏబీసీడీ. అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ ఉపశీర్షిక. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. సురేష్‌బాబు సమర్పణలో మధురశ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఇద్దరు ఎన్నారై యువకుల కథ ఇది. వారికి ఇండియాలో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? డబ్బే ప్రధానమని నమ్మిన వారు మనుషుల విలువను ఎలా తెలుసుకున్నారన్నది ఆకట్టుకుంటుంది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సిద్ శ్రీరామ్ ఆలపించిన మెల్ల మెల్లగా.. గీతాన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇరవై ఐదు లక్షల మంది వీక్షించారు అని తెలిపారు. నాగబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జుధాసాంధీ.

749

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles