వంద లొకేషన్లలో షూటింగ్..

Thu,September 19, 2019 10:44 PM

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ సినిమాకు సంబంధించిన సృజనాత్మక విషయాల్లో ఏమాత్రం రాజీ పడరు. తాజాగా ఆయన కథానాయకుడిగా లాల్‌సింగ్ ఛద్దా పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. టామ్‌హాంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందిస్తున్నారు. కాలగమనంలో కొన్ని చారిత్రక ఘటనలకు ఓ వ్యక్తి ఎలా సాక్షీభూతంలా నిలిచాడన్నది చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా ఈ సినిమాను దాదాపు 100కుపైగా లొకేషన్లలో చిత్రీకరించబోతున్నారట. ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్‌తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఎటువంటి సెట్‌లు లేకుండా ప్రతి సన్నివేశం వాస్తవికతను ప్రతిబింబించేలా సహజసిద్ధంగా ఉండాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నారట. నవంబర్ 1 నుంచి చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సినిమా కోసం అమీర్‌ఖాన్ బరువు తగ్గుతున్నారు.

424

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles