నా నువ్వుగా మారావే..


Sun,February 17, 2019 12:27 AM

aakattukune pranavam melodi to release the song

శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రణవం. జి.కుమార్ దర్శకుడు. తను.ఎస్ నిర్మిస్తున్నారు. పద్మారావ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని నువ్వు నా నువ్వుగా ఇక మారావే.. అనే గీతాన్ని ప్రేమికుల రోజున ఆర్.పి.పట్నాయక్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ చాలా కాలం విరామం తర్వాత నేను ఆలపించిన మెలోడీ గీతమిది. శ్రోతలందరిని ఈ పాట ఆకట్టుకుంటుంది అనితెలిపారు. హీరో శ్రీ మంగం మాట్లాడుతూ భరతనాట్యం నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రతిక్షణం ఉత్కంఠను పంచుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. మార్చి నెలలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఆర్.పి.పట్నాయక్, ఉష ఆలపించిన ఈ గీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సంగీత దర్శకుడు చెప్పారు.

1011

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles