రెండు మెదళ్లు ఉంటే..


Fri,April 12, 2019 12:28 AM

Aadi Saikumar New Movie Burra katha Movie First Look Relese

ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బుర్రకథ. డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుంది? అతని మానసిక ప్రవర్తన ఎలా సాగుతుంది? అనే ఆసక్తికరమైన అంశాన్ని వినోదప్రధానంగా ఈ సినిమాలో ఆవిష్కరించాం. వినూత్న కథాంశంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. మిస్తీ చక్రవర్తి, నైరాషా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, స్క్రీన్‌ప్లే: ఎస్.కిరణ్, సయ్యద్, ప్రసాద్ కామినేని, సురేష్ ఆరపాటి, దివ్యభవాన్, రచన-దర్శకత్వం: డైమండ్ రత్నబాబు.

1902

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles