Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ద్విభాషా చిత్రంలో


Tue,March 19, 2019 11:36 PM

Aadi Sai Kumar makes his Tamil debut

ఆది సాయికుమార్, వేదిక నాయకానాయికలుగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందుతున్నది. కార్తిక్ విఘ్నేష్ దర్శకుడు. ఏంజీ అరా సినిమాస్, న్యూఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం ప్రారంభమైంది. విభిన్నమైన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఆది పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. వేదిక తెలుగులో నటిస్తున్న నాలుగో చిత్రమిది. ఈ నెల 25 నుండి చిత్తూరుజిల్లాలోని తలకోనలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రోబో, 2.ఓ చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్‌గా పనిచేసిన గౌతమ్‌జార్జ్ ఈ సినిమాకు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సి. సత్య.

883
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles