ఆది క్రీడా నేపథ్య చిత్రం


Wed,May 8, 2019 11:39 PM

aadhi pinisetty as an athlete in bilingual sports drama

ఆది పినిశెట్టి కథానాయకుడిగా క్రీడానేపథ్య ఇతివృత్తంతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. బిగ్‌ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియయేస్తూ ఆదిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ ఇది. అందిరిలో ఆసక్తినిరేకెత్తిస్తుంది. తన కలల్ని సాకారం చేసుకోవడానికి ఓ యువకుడు ఏం చేశాడన్నదే చిత్ర కథ. ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. ఆది పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నది అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌కుమార్, ఆర్ట్: వైరబాలన్, ఎడిటర్: రాహుల్, కథ, దర్శకత్వం: ప్రిత్వి ఆదిత్య.

775

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles