సందేశంతో ఆ నిమిషం

Sat,March 9, 2019 11:55 PM

నూతన నటీనటులతో వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఆ నిమిషం. కళారాజేష్ దర్శకుడు. బండారు హరితేజ నిర్మాత. ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆడపిల్లలను స్వాగతించండి. వారిని సంరక్షించండి. ఆడపిల్లలే ఏ దేశానికైనా నిజమైన ఆస్తి అనే సందేశాత్మక ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆడపిల్లల జననరేటు చాలా తగ్గిపోతున్నది. సమాజంలో ఎన్నో మార్పులొస్తున్నా ఆడపిల్లలను పురిటిలోనే చంపేయడం దారుణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాం అన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మంచి సందేశంతో ఆకట్టుకుంటుంది. నటీనటులు కొత్తవారైనా చక్కటి అభినయాన్ని కనబరిచారు. మా తొలిప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని నిర్మాత తెలిపారు. ప్రసాద్‌రెడ్డి, రాణిశ్రీ, రేణుక, బేబీ రోహిసంజన, బేబీ, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వై.ప్రసాద్, సంగీతం: కున్ని గుడిపాటి.

1443

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles