అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల సినిమా షురూ


Sat,April 13, 2019 10:57 PM

AA 19 Allu Arjun film with director Trivikram Srinivas goes on floors

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా హెగ్డే కథానాయిక. హీరో అల్లు అర్జున్ నటిస్తున్న 19వ చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అల్లు అర్జున్ క్లాప్ నివ్వగా, దర్శకుడికి చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్‌ని అందించారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది.

దీంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నామని, ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. యువ హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సత్యరాజ్, సునీల్, రాజేంద్రప్రసాద్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్ వినోద్, సంగీతం: తమన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్.

2192

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles