రోబో అమీ!


Wed,October 11, 2017 11:49 PM

roboamy
రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ సృష్టిస్తున్న మరో అద్భుతం 2.0. టూడీ, త్రీడీ ఫార్మాట్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో లైకాప్రొక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. అమీజాక్సన్ కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా కీలక పాత్రలో నటిస్తున్నారు. మర మనిషిలో ప్రేమపుడితే దాని పర్యవసానం ఎలా వుంటుందనే ఆసక్తికరమైన కథ, కథనాలతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రారంభం నుంచి సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల లుక్‌లను మాత్రమే చిత్ర బృందం విడుదల చేసింది. అయితే తాజాగా ఇందులో కథానాయకగా నటిస్తున్న అమీజాక్సన్ ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు శంకర్ బుధవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు అని అనిరాసి వున్న ఈ ప్రచార చిత్రంలో అమీ రోబో గెటప్‌లో కనిపిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ గీతాన్ని చెన్నైలోని రెడ్ హిల్స్‌లో ఏ.ఆర్.రెహమాన్ కొత్తగా నిర్మించిన వైఎమ్ స్టూడియోస్‌లో మంగళవారం నుంచి చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ నెల 27న దుబాయ్‌లో ఆడియోను విడుదల చేసి, టీజర్‌ను నవంబర్ 22న హైదరాబాద్‌లో, ట్రైలర్‌ను డిసెంబర్ 12న చెన్నైలో విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా వచ్చే ఏడాది జనవరి 25న చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

471

More News

VIRAL NEWS