83 వరల్డ్‌కప్ నేపథ్యంలో..


Fri,April 12, 2019 12:28 AM

83 First Look Ranveer Singh relives Indias Greatest Story

భారత్‌కు క్రికెట్‌లో తొలి ప్రపంచకప్‌ని అందించిన సారథి కపిల్‌దేవ్. ఆయన జీవితకథ ఆధారంగా 1983 వరల్డ్‌కప్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 83. కపిల్‌దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో మధు మంతెన, విష్ణు ఇందూరి, కబీర్‌ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 80వ దశకం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అప్పటి భారత జట్టులో వున్న వాళ్లకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లో టీమ్ మెంబర్స్ అంతా మైదానంలో కూర్చుని ఆటకు సిద్ధం అన్నట్టుగా ఫోజివ్వడం ఆకట్టుకుంటున్నది. ఈ రోజు నుంచి సరిగ్గా ఏడాది తరువాత ఓ గ్రేట్ స్టోరీకి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నాం. 2020 ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది అని రణ్‌వీర్‌సింగ్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో వెల్లడించడం సినిమాపై అంచనాల్ని పెంచుతున్నది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాత్రలో తాహీర్ రాజ్ భాసిన్, అప్పటి టీమిండియా మేనేజర్ మాన్‌సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్, కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణీ పాత్రలో సాహిల్ కట్టర్, బల్వీందర్ సింగ్ పాత్రలో అమ్మీ విర్క్, దిలీప్ వెంగ్‌సర్కార్ పాత్రలో ఆదినాథ్ కొఠారే, మహీందర్ అమర్‌నాథ్ పాత్రలో సాకిబ్ సలీమ్ నటిస్తున్నారు.

1343

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles