ముక్కోణపు ప్రేమాయణం


Fri,February 15, 2019 11:16 PM

4 letters movie released on 22

రొమాన్స్, వినోదం సమపాళ్లలో మిళితమైన చిత్రమిది ఇంజినీరింగ్ విద్యార్థుల కష్టాలను ఆవిష్కరిస్తూ చక్కటి సందేశంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అన్నారు ఈశ్వర్. ఆయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 4లెటర్స్. ఆర్.రఘురాజ్ దర్శకుడు. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదలకానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈశ్వర్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఇంజినీరింగ్ చదివే డబ్బున్న యువకుడిగా నా పాత్ర వినూత్నంగా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిల్ని ఇష్టపడతాను. ఆ ఇద్దరిలో ఎవరిని నా జీవితభాగస్వామిగా ఎంచుకున్నానన్నదే చిత్ర ఇతివృత్తం.

మా ముగ్గురు మధ్య సాగే ముక్కోణపు ప్రేమాయణం ఆకట్టుకుంటుంది. నాలుగు అక్షరాలతో ముడిపడిన కొంతమంది జీవితాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. అశ్లీలతకు తావులేని సన్నివేశాలు, నిత్యజీవితంలో మనం మాట్లాడుకునే సంభాషణలు సినిమాలో వినిపిస్తాయి. వైజాగ్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. గతంలో పలు నాటకాలతో పాటు ఆ ఇద్దరు అనే లఘు చిత్రంలో నటించాను. నటన పట్ల నా ఆసక్తిని గమనించిన అమ్మానాన్నలు ఏ విషయంలో రాజీపడకుండా చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని ఉందా లేదా అనే గీతాన్ని నేనే ఆలపించాను. హీరోగా ఈ సినిమా నాకు చక్కటి శుభారంభాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత తదుపరి చిత్రంపై నిర్ణయానికి వస్తాను అని తెలిపారు.

497

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles