200కోట్లతో హిరణ్య


Sun,December 16, 2018 12:24 AM

200 crores budget rana gunasekhar hiranya kashyapa

యువ హీరో రానా సినిమాల వేగం పెంచారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వున్నారు.కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు.హిరణ్య పేరుతో పౌరాణిక కథాంశంతో రానా భారీ చిత్రానికి సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం
వహించబోతున్నారు. పురాణాల్లోని హిరణ్యకశిపుడనే రాక్షసుడి వృత్తాంతంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. రుద్రమదేవి తర్వాత ఈ కథపైనే దర్శకుడు గుణశేఖర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా భాషల నుంచి ప్రముఖ నటులను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాకు దాదాపు 200కోట్ల బడ్జెట్‌ను వెచ్చించబోతున్నట్లు తెలుస్తున్నది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేయబోతున్నారని చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతిక సొబగులతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సురేష్‌ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం పూర్వనిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2019 జనవరిలో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రానా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో
నటిస్తున్నారు.

1253

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles