రెండు రాష్ర్టాల ప్రేమ


Mon,October 15, 2018 02:17 AM

2 states movie first look for vijayadasami articleshow

అడివిశేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 2స్టేట్స్.వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మాత. శివానీరాజశేఖర్ కథానాయికగా పరిచయం అవుతోంది. దసరా సందర్భంగా చిత్రఫస్ట్‌లుక్‌ను విడుదలచేయనున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. చేతన్‌భగత్ రాసిన 2స్టేట్స్ నవల ఆధారంగా రూపొందిస్తున్నాం. భిన్న భాషలు, సంస్కృతులు కలిగిన ఓ జంట ప్రణయకథ ఇది. అందమైన దృశ్యకావ్యంలా ఉంటుంది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ, కుటుంబ బంధాల కలబోతగా సాగే చిత్రమిది. కోల్‌కతా, హైదారాబాద్‌లో నాలుగు షెడ్యూల్స్ పూర్తిచేశాం. ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో జానీ మాస్టర్ సారథ్యంలో ఓ పెళ్లిపాటను చిత్రీకరిస్తాం. విదేశాల్లో జరిపే మరో షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తవుతుంది అని అన్నారు. రజత్‌కపూర్, భాగ్యశ్రీ, లిజి, ఆదిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖరామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, సంభాషణలు: మిథున్ చైతన్య.

3215

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles