సుకుమార్‌కు అంకితం!


Mon,July 22, 2019 12:00 AM

2 hours love trailer launch

శ్రీపవార్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 2అవర్స్ లవ్. శ్రీనిక క్రియేటివ్ వర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. కృతిగార్గ్ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండుగంటల పాటు ప్రేక్షకుల్ని ప్రేమలోకంలో విహరింపజేసే సినిమా ఇది. కథానాయకుడిగా, దర్శకుడిగా శ్రీపవార్ ప్రతిభను చాటాడు. ప్రస్తుతం మంచి కథలతో రూపొందుతున్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని తెలిపారు. శ్రీపవార్ మాట్లాడుతూ సుకుమార్ స్ఫూర్తితో దర్శకుడినయ్యాను. ఆయనకు ఈ సినిమాను అంకితం ఇస్తున్నాను. ప్రేమ, రొమాన్స్ హంగుల కలబోతగా సాగే సినిమా ఇది. ఓ ప్రేమ జంట జీవితంలో రెండు గంటల్లో చోటుచేసుకునే పరిణామాలు ఆసక్తిని పంచుతాయి. త్వరలో విడుదలతేదీని వెల్లడిస్తాం అని చెప్పారు. తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తుండటం ఆనందంగా ఉందని కృతిగార్గ్ చెప్పింది.

471

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles