చదువులో ఫస్ట్.. బుద్ధిలో లాస్ట్


Sat,June 8, 2019 11:55 PM

1st Rank King movie to release on June 21st

చేతన్ మద్దినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు నరేష్‌కుమార్ హెచ్.ఎన్ దర్శకుడు. కాశివోరా కథానాయిక. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చదువుల్లో ఫస్ట్ వున్న రాజు బుద్ధిలో మాత్రం వెనుకబడిపోతాడు. అలాంటి వ్యక్తికి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కొన్నాడు?. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ నేపథ్యంలో చోటు చేసుకునే వినోదభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్ర కథ. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది.

త్వరలో ట్రైలర్‌ని విడుదల చేస్తాం. సినిమాలో ప్రకాష్‌రాజ్, నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ప్రియదర్శి, తనికెళ్లభరణి వంటి పేరున్న నటీనటులు నటించారు అన్నారు. త్వరలో ట్రైలర్‌తో రాజు పాత్రకు సంబంధించి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తోంది అని చేతన్ తెలిపారు. కన్నడంలో భారీ విజయాన్ని సాధించిన చిత్రానికిది రీమేక్. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 21న విడుదల చేస్తున్నాం అని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశివోరా, అమిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

2477

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles