ప్రతి ఒక్కరి కథ ఇది!


Fri,February 15, 2019 11:19 PM

118 movie trailer launch

ఈ సినిమా ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పాం. ఇందులో కథానాయిక పాత్ర కంటతడి పెట్టిస్తుంది. ఆమె పాత్ర చుట్టే కథ నడుస్తుంది అన్నారు కల్యాణ్‌రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 118. కె.వి.గుహన్ దర్శకుడు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. నివేథా థామస్, షాలినిపాండే కథానాయికలు. మార్చి 1న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ ఇది. అయితే మనం కొన్ని సంఘటనల్ని లోతుగా ఆలోచించం. ఈ సినిమాలో నేను ప్రతి విషయాన్ని శోధించి సాధించాలనే ఉత్సుకత ఉన్న వ్యక్తిగా కనిపిస్తాను. కథ విన్నప్పుడు తొలుత మా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లోనే సినిమా చేద్దామనుకున్నాం. మహేష్ కోనేరుకు కథ బాగా నచ్చడంతో తానే నిర్మిస్తానని ముందుకొచ్చారు. సాంకేతికంగా ఉన్నతమైన విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సంగీతం, రీరికార్డింగ్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి అన్నారు. కల్యాణ్‌రామ్ నటన మరోస్థాయిలో ఉంటుంది.

కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది అని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కల్యాణ్‌రామ్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అనిపిస్తుంది అని చెప్పారు. ఉద్విగ్నత, భావోద్వేగాలు మేళవించిన చిత్రమిదని, కథానగుణంగా చక్కటి స్వరాల్ని అందించే అవకాశం లభించిందని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన చిత్రమిదని కథానాయిక నివేథా థామస్ తెలిపింది. ఈ కార్యక్రమంలో మాటల రచయిత మిర్చి కిరణ్ పాల్గొన్నారు.

845

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles